Folk songs lyrics

Saturday, December 6, 2025

Telugu Folk Song Lyrics – Perugalla Peddireddy Biddano

పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా

కోరమీసాలు దువ్వుతూ మా నాయనా
కోరొక్క కూత పెడితేనే ఓ నాయనా
పెద్దప్పులంతా సప్పుడే మా నాయనా
తప్పే ఒప్పేసుకుంటారే...

ఊరంతా పెద్దోడు నా ముందు పసోడు పసోడు…

నేను పుట్టినప్పుడు మా నాయనా
నిండు అమాసనంటానే ఓ నాయనా
మా నాయనా మొఖం అప్పుడు
మా నాయనా పండు పున్నామంటనే

మా నాయనా గుండె తొట్టెలా జేసి నన్ను ఉయ్యాల్లో ఊపేనంటనే..

పట్టా గొలుసులు తెచ్చెనే ఓ నాయనా
పెట్టి మురిసిపోయెనే మా నాయనా
పట్టు లంగాలు తెచ్చెనే ఓ నాయనా
కట్టి మురిసిపోయెనే మా నాయనా

మారాణి నేనైతే గుర్రమే తానై నా బారాలు అన్ని మోసేనే..

ఏడు ఊళ్లు చెప్పుకునేలా ఓ నాయనా
నా పెళ్లి చేసినాడులే మా నాయనా
కన్నీళ్లు దాచి గుండెల ఓ నాయనా
అక్షింతలేసినాడులే మా నాయనా

నేను లేని ఇంటిలో మా నాయనా
కునుకే లేక కంటిలో పనుకుండే గాఢ నిద్రలో మా నాయనా
బాయిగడ్డ మీది మట్టిలో..

కడుపారగన్నోడు నా కడుపులో పుడితే
పెట్టుకుంటి ఆయన పేరునే..

About This Song

ఈ పాటలో తండ్రి కష్టం, ప్రేమ, త్యాగం మరియు పిల్లలపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించడం ద్వారా గ్రామీణ భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. Telangana Janapada Geethaluలో ఇది భావోద్వేగభరితమైన పాటలలో ఒకటి.

Why People Love This Song

  • తండ్రి ప్రేమ ప్రతిబింబం
  • గ్రామీణ బూతుల సౌందర్యం
  • హృదయాన్ని తాకే ఎమోషనల్ లైన్స్
  • వేదికలపై తరచూ పాడే పాట


© 2025 ifolksongs. All Rights Reserved.
ifolksongs | Designed by Oddthemes | Distributed by Gooyaabi